అమరావతి ఉద్యమం : పాస్‌పోర్ట్ టార్గెట్ గా కేసులు
అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ రైతులు చేస్తోన్న ఆందోళన 27వరోజుకు చేరింది. అయితే ఈ ఉద్యమాన్ని అణిచేందుకు పోలీసులు సామదాన దండోపాయాలన్నింటిని ప్రయోగిస్తున్నారు. తాజాగా పాస్‌పోర్ట్ టార్గెట్ చేస్తూ కేసులు పెడుతున్నారు. రాజధానిరైతులకు మద్దతుగా విజయవాడ ర్యాలీలో పాల్గొన్న మహిళలపై కేసుల ఉచ్చు బిగిస్తున్నారు వారి పాస్‌పోర్ట్‌లపై ప్రభావం పడేలా వ్యూహం సిద్ధం చేస్తున్నారు.
అమరావతి పరిరక్షణ కోసం ఈ నెల 10న మహిళలు, యువతులు పెద్దసంఖ్యలో విజయవాడలోని బెంజ్ సర్కిల్ నుంచి మహాత్మాగాంధీ రోడ్డులోని సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ తలపెట్టారు. దీనికి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో నిర్బంధాలు, పోలీసులను చేధించుకుంటూ ఎంజీ రోడ్డుపైకి వచ్చారు యువతులు. ఈ ర్యాలీలో దాదాపు 8వేల మంది మహిళలు, యువతులు పాల్గొన్నారు....
ఇలా ర్యాలీకి వచ్చిన మహిళలు, యువతులను పోలీసులు అరెస్ట్ చేసి వివిధ స్టేషన్లకు తరలించారు. వారి ఆధార్, పాస్‌పోర్ట్ నెంబర్లు సేకరించి.. మొత్తం 8 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. 4 వేల మంది మహిళలపై కేసులు నమోదయ్యాయి. ఈ వివరాలను విజయవాడలోని ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయానికి అందించారు. ర్యాలీలో పాల్గొన్న యువతుల్లో ఎక్కువమంది విదేశాల్లో చదువుకోవాలని రెడీ అవుతున్నారు. దీంతో వారి భవిష్యత్‌ను లక్ష్యంగా చేసుకుని పోలీసులు కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com