డోర్ మ్యాట్లు, బాత్‌రూమ్ టైల్స్‌పై హిందూ దేవుళ్ల ఫోటోలు

డోర్ మ్యాట్లు, బాత్‌రూమ్ టైల్స్‌పై హిందూ దేవుళ్ల ఫోటోలు

amazon

ఆన్‌లైన్ మార్కెట్ దిగ్గజం అమేజాన్ మరోసారి సంకుచిత బుద్దిని ప్రదర్శించింది. హిందూ దేవుళ్ల చిత్రాలను అవమానపరిచింది. డోర్ మ్యాట్లు, బాత్‌రూమ్ టైల్స్‌పై హిందూ దేవుళ్ల ఫోటోలను చిత్రించి విక్రయించింది. ఈ వ్యవహారంపై ప్రజలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలను అవమానపరచడం అమేజాన్‌కు అలవాటుగా మారిందని నెటిజన్లు విరుచుకుపడ్డారు. భారతీయ దేవుళ్లను కించపరుస్తున్న అమేజాన్‌ను బహిష్కరించాలని నినదించారు. అమేజాన్‌ను బాయ్‌కాట్ చేయాలని, భారతీయులకు అమేజాన్ సంస్థ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బాయ్‌కాట్ అమేజాన్ అంటూ ట్విటర్‌లో హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ అవుతోంది.

ఇక చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకున్నట్టుగా అమేజాన్ స్పందించింది. వివాదానికి కారణమైన దేవతా చిత్రాలున్న డోర్ మ్యాట్స్, బాత్‌రూమ్ టైల్స్‌ను తొలగిస్తున్నట్టు పేర్కొంది. ఐతే, అమేజాన్‌లో ఇలాంటి ఘటనలు జరగడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ చాలాసార్లు హిందూ దేవతలను అమేజాన్ కించపరిచింది. హిందూ దేవుళ్ల ఫోటోలు ఉన్న చెప్పులు, షూలను ఆన్‌లైన్‌లో కొనుగోళ్ల కు పెట్టి అవమానపరిచింది. అప్పుడు కూడా నెటిజన్లు సీరియస్‌గా స్పందించడంతో అప్పటికప్పుడు ఆ వస్తువులను తొలగించింది.

Tags

Next Story