కోడి పందాలను లాంఛనంగా ప్రారంభించిన ఎంపీ కనుమూరి
BY TV5 Telugu13 Jan 2020 6:20 AM GMT

X
TV5 Telugu13 Jan 2020 6:20 AM GMT
పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఎంపీ కనుమూరి రఘురామ కృష్ణంరాజు అయిభీమవరంలోని తన నివాసంలో కోడి పందాలు లాంఛనంగా ప్రారంభించారు. సంప్రదాయాల్ని కాపాడుకోవడంలో తప్పేమీ లేదని, గోదావరి జిల్లాల్లో పండగకు ఎంతో ప్రత్యేకత ఉందన్నారు. పైగా ఎన్నో కోళ్ల జాతుల్ని పరిరక్షించుకునేందుకు ఇదో మంచి అవకాశం అని చెప్పారు. కోడి పందాలతోపాటు, ఎడ్లపందాలు, పొటేలు పందాల్లాంటివి కూడా కాపాడుకోవాలన్నారు.
ఏటా సంక్రాంతి సమయంలో పోలీసుల ఆంక్షలు, హైకోర్టు ఆదేశాలు లాంటివి ఎన్ని ఉన్నా.. కోడిపందాలు జోరుగానే జరుగుతుంటాయి. ఈసారి కూడా ఇప్పటికే పందెం పుంజులు యుద్ధానికి సిద్ధమయ్యాయి. ఇప్పటికే అక్కడక్కడా పందాలు జరుగుతున్నా.. రేపు బోగి మంటలు వెయ్యగానే జోరు ఓ స్థాయికి వెళ్తుంది. ఇందుకోసం తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఈసారి కూడా భారీ బరులు సిద్ధమయ్యాయి.
Next Story