శబరిమల రివ్యూ పిటిషన్లపై నేటి నుంచి సుప్రీంలో విచారణ

శబరిమల రివ్యూ పిటిషన్లపై నేటి నుంచి సుప్రీంలో విచారణ

Mandala-Makaravillakku-pilgrimage-season-in-Sabarimalaశబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన రివ్యూ పిటిషన్లపై సుప్రీం కోర్టు ఇవాళ్టి నుంచి విచారణ చేపట్టనుంది. శబరిమల ఆలయంలోకి అన్ని వయసులు గల మహిళలు వెళ్లవచ్చని సుప్రీం కోర్టు 2018 సెప్టెంబర్ 28న తీర్పునిచ్చింది. దీన్ని సవాల్‌ చేస్తూ దాదాపు 60కి పైగా రివ్యూ పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై ఇవాళ్టీ నుంచి సుప్రీంకోర్టు ధర్మాసనం రోజువారీ విచారణ చేయనుంది.

గతేడాది సెప్టెంబర్‌లో అయోధ్య తీర్పు తరువాత.. శబరిమలపైనా సుప్రీంకోర్టు తుది నిర్ణయాన్ని తీసుకోవాల్సి ఉండగా.. వాయిదా పడింది. శబరిమల ఆలయంలో మహిళలకు ప్రవేశం కల్పించడంపై దాఖలైన మొత్తం 60 పిటీషన్లను విస్తృత ధర్మాసనానికి బదిలీ చేశారు అప్పటి చీఫ్‌ జస్టిస్‌ రంజన్ గొగొయ్. ఆ తరువాత.. ఈ పిటీషన్‌పై బెంచ్ మారిపోయింది.

ఏడుగురు సభ్యులు ఉన్న విస్తృత ధర్మాసనానికి శబరిమల రివ్యూ పిటీషన్లను బదిలీ చేసినప్పటికీ.. ఆ తరువాత ఈ సంఖ్య 9కి పెరిగింది. ప్రస్తుతం 9 మంది సభ్యులు ఉన్న విస్తృత ధర్మాసనం ఈ రివ్యూ పిటీషన్‌పై విచారణ చేపట్టనుంది. విచారణ ముగిసిన వెంటనే తీర్పును వెలువరిస్తుందా? లేక రిజర్వ్‌లో ఉంచుతుందా? అనేది ఆసక్తి రేపుతోంది. శబరిమల ఆలయంలోకి ప్రవేశాన్ని కల్పించాలంటూ ఇదివరకు మహిళా సంఘాలు దాఖలు చేసిన పిటీషన్లను కొట్టేయడం.. తుది తీర్పుపై ప్రభావం చూపే అవకాశాలు లేవని అంటున్నారు. రివ్యూ పిటీషన్లపై విచారణ చేపట్టే ధర్మాసనానికి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరవింద్ బొబ్డె సారథ్యం వహిస్తారు.

Tags

Read MoreRead Less
Next Story