కోడిపందాలపై కొరడా

కోడిపందాలపై కొరడా

kodi

కోడిపందాలు నిర్వహించడానికి సిద్ధమవుతున్న వారిపై పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పోలీసులు, రెవెన్యూ అధికారులు కొరడా జళిపించారు. తణుకు మండలం పరిధిలోని తేతలి, మండపాక, వేల్పూరు గ్రామాల్లో కోడి పందాల బరులను ధ్వంసం చేశారు. కోడి పందాల నిర్వహణ కోసం చదును చేసిన ప్రాంతాన్ని పారలతో తవ్వించి.. ట్రాక్టర్లతో దున్నించారు. కోడి పందాల నిర్వహణ వల్ల కలిగే అనర్థాలను వివరించి.. ప్రభుత్వానికి సహకరించాలని సూచించారు. బరులు సిద్ధం చేసిన వారిపై బైండోవర్ కేసులు.. స్థలం ఇచ్చిన వారికి నోటీసులు జారీ చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

Tags

Next Story