విజయవాడలో ఇవాళ హైపవర్‌ కమిటీ సమావేశం

విజయవాడలో ఇవాళ హైపవర్‌ కమిటీ సమావేశం

Screenshot_3

విజయవాడలో ఇవాళ హైపవర్‌ కమిటీ సమావేశం కానుంది. ఉదయం 10 గంటలకు జరిగే ఈ సమావేశంలో 13 జిల్లాల అభివృద్ధి, మూడు రాజధానుల అంశంపై చర్చించనుంది. అటు.. రాజధాని రైతులకు ఏ రకమైన హామీ ఇవ్వాలని, వారికి ఏ రకంగా ప్రయోజనం కలిగేలా నిర్ణయాలు తీసుకోవాలన్నదానిపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఇక సచివాలయ ఉద్యోగుల ముందు కొన్ని ప్రతిపాదనలు కూడా పెట్టారు. ఈ ప్రతిపాదనలపై ఇవాళ కూడా చర్చించి ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది.

జీఎన్‌రావు, బోస్టన్‌ కమిటీలు ఇచ్చిన నివేదికపై ఏర్పాటైన హైపవర్‌ కమిటీ.. ఇప్పటికే రెండు సార్లు సమావేశమైంది. ఇవాళ జరిగేది మూడో సారి సమావేశం. ఈ కమిటీ ఈనెల 17న రిపోర్ట్‌ ఇవ్వనుంది. ఆ వెంటనే 18న ఏపీ కేబినెట్‌ ప్రత్యేకంగా ఇదే అంశంపై సమావేశమై... హైపవర్‌ కమిటీ రిపోర్ట్‌లోని సిఫార్సులకు ఆమోదం తెలపనుంది..

ఈ నెల 20న అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సమావేశంలో... అన్ని పార్టీలు, ఎమ్మెల్యేలు మూడు రాజధానులపై ప్రభుత్వం వివరణ ఇవ్వనుంది. ఈ సమావేశంలోనే మూడు రాజధానులకు అనుకూలంగా తీర్మానం ప్రవేశపెట్టి అధికారికంగా ఆమోద ముద్ర వేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం ఉభయసభలను సమావేశం పరచాలని భావిస్తోంది ఏపీ ప్రభుత్వం.

Tags

Read MoreRead Less
Next Story