టీవీ-5 ఎఫెక్ట్‌తో SVBC ఛైర్మన్‌ పృథ్వీరాజ్‌పై వేటు

టీవీ-5 ఎఫెక్ట్‌తో SVBC ఛైర్మన్‌ పృథ్వీరాజ్‌పై వేటు

prithviraj

టీవీ-5 ఎఫెక్ట్‌తో SVBC ఛైర్మన్‌ పృథ్వీరాజ్‌పై వేటుపడింది. ఓ మహిళతో ఆయన సాగించిన రాసలీలల ఆడియోటేప్‌ను వెలుగులోకి తెచ్చింది టీవీ-5. శనివారం రాత్రి ఆయనలోని రొమాంటిక్‌ యాంగిల్‌ను బయటి ప్రపంచానికి తెలియజేసింది. అత్యంత పవిత్రమైన పదవిలో ఉంటూ ... తెరచాటుగా పృథ్వి సాగించిన రాసలీలలపై టీవీ5 వరుస కథనాలు ప్రసారం చేసింది. టీవీ5 బయటపెట్టిన ఆ ఆడియో క్లిప్ పెను సంచలనమే సృష్టించింది. దీంతో ఈ ఎపిసోడ్ రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది.

ఎస్వీబీసీ చైర్మన్ పృధ్విరాజ్ పై చెలరేగిన టీటీడీ మొత్తం షేక్ అయింది. వెంటనే విజిలెన్స్ టీంతో దర్యాప్తు జరిపించారు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. అలాగే ఆ ఆడియోలోని వాయిస్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపి పూర్తిస్థాయి విచారణకు ఆదేశించారు. దీనిపై అన్ని వివరాలను C.M.O ఆఫీసుకు పంపించారు. అప్పటికే ఇష్యూ రచ్చ రచ్చ కావడంతో..సీఎం చాలా సీరియస్ అయ్యారు.. చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. హైకమాండ్ నుంచి అందిన ఆదేశాలతో వెంటనే తన పదవికి రాజీనామా చేశారు పృథ్వీ. అలా టీవీ-5 వెలుగులోకి తెచ్చిన రాసలీలల ఆడియో క్లిప్ పదవికి పృథ్వి పదవికి ఎసరు పెట్టింది...

పృధ్విరాజ్ సీక్రెట్స్ రివీల్ కావటంతో ఆయనపై అన్ని వర్గాలు మండిపడ్డాయి. పృథ్వీరాజ్‌ వ్యవహార శైలిపై ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.

తనపై వచ్చిన ఆరోపణల పట్ల మీడియా సమావేశంలో సుదీర్ఘ వివరణ ఇచ్చారు పృథ్వీ. ఫేక్ వాయిస్ పెట్టి అప్రతిష్టపాలు చేశారని ఆరోపించారు. ఆడియో టేపులపై పూర్తి విచారణకు డిమాండ్ చేశారు. ఎంక్వైరీ పూర్తయ్యాకే మళ్లీ ఎస్వీబీసీలో అడుగుపెడుతానని అన్నారు.

రాజధాని రైతులపై చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నాని స్పష్టం చేశారు పృథ్వి. పోసానితోనూ అనవసరంగా గొడవలు పెట్టారని చెప్పుకొచ్చారు. పదవికి రాజీనామా చేశాను కాబట్టి ఇక ఎవరికి బయపడాల్సిన పనిలేదని...రేపటి నుంచి అందరినీ కడిగిపారేస్తానని చెప్పారు పృథ్వి. అయితే తనకు హైకమాండ్ నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని...తానే స్వచ్చంధంగా రాజీనామా చేశానని అన్నారు పృథ్వి.

పృథ్విరాజ్‌ తీరు మొదటి నుంచి వివాదాస్పదమే. అసలు ఆయన్ను SVBC చైర్మన్‌గా నియామించడంపైనే చాలా వ్యతిరేకత వ్యక్తమైంది. ఆయనకు అర్హతలేంటని ప్రశ్నించారు. ఆయనకు ముందు.. ప్రసిద్ధ సినీ దర్శకుడు రాఘవేంద్రరావు SVBC చైర్మన్‌గా ఉండేవారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత వైసీపీ ప్రభుత్వం ఏర్పడటంతో... రాఘవేంద్ర రావును తొలగించి... కమేడియన్‌ పృథ్వీరాజ్‌ను చైర్మన్‌ను చేశారు. పదవి చెపట్టిన తర్వాత పృథ్విరాజ్ మరింతగా రెచ్చిపోయాడన్న ఆరోపణలున్నాయి. దాదాపుగా 36 మంది ఉద్యోగులను ఇష్టానుసారంగా నియమించుకుని, డబ్బులు వసూలు చేశారని ఆరోపణలు వచ్చాయి.

Tags

Read MoreRead Less
Next Story