జీఎన్‌రావు కమిటీ, బీసీజీ నివేదికలను మంటల్లో వేసి జరుపుకున్న భోగిపండగ

జీఎన్‌రావు కమిటీ, బీసీజీ నివేదికలను మంటల్లో వేసి జరుపుకున్న భోగిపండగ

BABU

అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ప్రతిపక్ష నేత చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సంప్రదాయబద్ధంగా భోగి మంటలు వెలిగించి.. జీఎన్‌రావు కమిటీ, బీసీజీ నివేదికలను అందులో వేసి తగులబెట్టారు. జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. తెలుగు ప్రజలు సంతోషంతో జరుపుకోవాల్సిన సంక్రాంతి.. ఈసారి కష్టాల మధ్య జరుగుతోందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. విదేశాల్లోని తెలుగువారు సైతం అమరావతిపై ఆవేదన చెందుతున్నారని తెలిపారు.

ఇక, అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలంటూ అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో విజయవాడలో వినూత్న రీతిలో భోగిమంటలు వేశారు. జీఎన్‌రావు, బీసీజీ నివేదికలు చెత్తతో సమానమంటూ భోగి మంటల్లో పడేశారు. ఆంధ్రప్రదేశ్‌కు ఒకేరాజధాని ఉండాలంటూ నినదించారు.

వెలగపూడిలో రిలే దీక్షల వద్ద ముగ్గులు వేసి రాజధాని మహిళలు నిరసన తెలిపారు. రాజధాని తరలించొద్దని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం వెనక్కి తగ్గే వరకు తమ పోరాటం ఆగదన్నారు. అటు.. మందడంలో ప్రభుత్వంపై నిరసన తెలుపుతూ ముగ్గులు వేశారు.

ఇదిలావుంటే, అమరావతి రాజధాని సెగ హైదరాబాద్‌కు తాకింది. ఒకే రాష్ట్రం.. ఒకే రాజధానిని కొనసాగించాలని హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో భోగి మంటలు వేశారు. జీఎస్ రావు, బొస్టన్ కమిటీ నివేదికలను భోగి మంటల్లో వేస్తూ సేవ్ అమరావతి అంటూ నినాదాలు చేశారు. గ్రీన్ క్యాపిటల్‌గా రూపుదిద్దుకుంటున్న అమరావతిని కాపాడాలంటూ ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మూడు రాజధానులు వద్దు.. ఒక రాజధాని ముద్దు అంటూ నినాదాలు చేశారు.

Tags

Read MoreRead Less
Next Story