అమరావతి రైతులు సంతోషంగా ఉన్నారు.. ఆందోళన చేస్తున్నది రైతులే కాదు : మంత్రి శ్రీనివాస్

అమరావతి రైతులు సంతోషంగా ఉన్నారు.. ఆందోళన చేస్తున్నది రైతులే కాదు : మంత్రి శ్రీనివాస్

avanti

రాజధాని తరలింపుపై గత కొద్ది రోజులుగా అమరావతి రైతులు ఆందోళనచేస్తున్నారు. సంక్రాంతి పండగను కూడా జరుపుకుకోకుండా నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే, అమరావతి రైతులు సంతోషంగా ఉన్నారని, పండగ సంబరాలు జరుపుకుంటున్నారని చెప్పడం వైసీపీ నేతలకే చెల్లింది. అమరావతిలో ఆందోళన చేస్తున్నది రైతులు కాదని అన్నారు మంత్రి అవంతి శ్రీనివాస్. అంతేకాదు, టీడీపీ అధినేత చంద్రబాబు ఫ్యాబ్రికేట్ ఉద్యమం చేయిస్తున్నాడని మండిపడ్డారు. మూడు రాజధానుల ప్రకటన ముందుచూపుకు అద్దం పడుతోందన్నారు.

Tags

Next Story