తెలుగు లోగిళ్లలో ఘనంగా భోగి వేడుకలు

తెలుగు లోగిళ్లలో ఘనంగా భోగి వేడుకలు

bogi

తెలుగు లోగిళ్లలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి. భోగ భాగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ భోగి మంటల కార్యక్రమాన్ని వేడుకలా నిర్వహించారు. విశాఖ జిల్లాలో మహిళలు భోగి మంటల చుట్టూ రంగవల్లులు వేసి.. అందంగా ముస్తాబు చేశారు.

తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో భోగి వేడుకలు అంబరాన్నంటాయి. చిన్నాపెద్ద అంతా భోగి మంటలు వేశారు. ఒకరికొకరు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

నెల్లూరు జిల్లాలో భోగి పండుగ ఆనందాన్ని తెచ్చింది. తెల్లవారకముందే చలిమంటలు వేసి సంప్రదాయ దుస్తుల్లో బంధువులతో, ఇరుగుపొరుగు వారితో కలిసి ఉత్సాహంగా భోగి వేడుకలు జరుపుకుంటున్నారు.

తిరుపతి సమీపంలోని రంగంపేటలోని విద్యానికేతన్‌లో భోగి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో సినీనటుడు మంచు మోహన్‌బాబు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. భోగి మంటలు వేసి ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.

హైదరాబాద్‌ మలేసియా టౌన్‌షిప్‌లో భోగి వేడుకలు నిర్వహించారు. స్థానికులు సంప్రదాయ దుస్తుల్లో భోగిమంటలు వెలిగించారు. పాత వస్తువులను మంటల్లో వేసి.. కొత్తదనానికి ఆహ్వానం పలికారు.

Tags

Next Story