అమరావతి ప్రాంతం.. కల్లోల కశ్మీర్‌ను తలపిస్తుంది

అమరావతి ప్రాంతం.. కల్లోల కశ్మీర్‌ను తలపిస్తుంది
X

madhu

అమరావతి ప్రాంతం కల్లోల కశ్మీర్‌ ను తలపిస్తోందన్నారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు. మూడు రాజధానుల నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అమరావతి రాజధాని ఒక్క ప్రాంతానికి సంబంధించిన సమస్య కాదని.. ఐదు కోట్ల ఆంధ్రుల సమస్య అని అన్నారు. రైతులు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తుంటే.. ప్రభుత్వం అణచివేయాలని చూస్తోందని మండిపడ్డారు. పోలీసులు తమ తీరును మార్చుకోవాలని సూచించారు. సీఎం జగన్ తన అనాలోచిత నిర్ణయాన్ని మార్చుకుని.. అమరావతిని రాజధానిగా కొసాగించాలని మధు డిమాండ్ చేశారు.

Tags

Next Story