కోనసీమలో కోడిపుంజుల రణరంగం

కోనసీమలో కోడిపుంజుల రణరంగం

kodi

కోనసీమలో కోడిపుంజుల రణరంగం మొదలైంది. తూర్పుగోదావరి జిల్లాలోని అమలాపురం రూరల్‌ మండలం ఇందుపల్లి, కామనగరువు, సాకుర్రు గున్నేపల్లి, కొంకాపల్లి.. అల్లవరం మండలం అల్లవరం, గుండెపూడి, గుడ్డివాని చింత, గుండెపూడి, రెల్లుగడ్డ... ఉప్పలగుప్త మండలం ఎస్‌.కొత్తపల్లి, ఎస్‌.యానాం, భీమనపల్లి గ్రామాల్లో కోడి పందాలు మొదలయ్యాయి. ఓ వైపు పోలీసులు వారం రోజుల నుంచి ఫ్లెక్సీలు కట్టి ప్రచారం చేసినా.. పందెం రాయుళ్లు ఏ మాత్రం పట్టించుకోలేదు. తరతరాలుగా వస్తున్న కోడి పందాలను నిర్వహిస్తూ.. ఎంజాయ్‌ చేస్తున్నారు. పోలీసుల ఆంక్షలకు విరుద్ధంగా.. కోడి పుంజులకు కత్తులు కట్టి పందాలు నిర్వహిస్తున్నారు.

Tags

Next Story