ఏటీఎంని వెయ్యి అడిగితే.. పదివేలు ఇచ్చింది. జోక్ కాదు.. పూర్తిగా చదువు నీకే తెలుస్తుంది

ఏటీఎంని వెయ్యి అడిగితే.. పదివేలు ఇచ్చింది. జోక్ కాదు.. పూర్తిగా చదువు నీకే తెలుస్తుంది

ATM

దేవుడు వరం ఇచ్చాడేమో అన్నట్టుగా ATMలో ఎంటర్‌ చేసిన అమౌంట్‌కన్నా ఎక్కువగా డబ్బులొస్తే... ఎవరికైనా ఇంకేం కావాలి. ఇలాంటి ఘటన వరంగల్ జిల్లా కమలాపూర్‌లో జరిగింది. బస్టాండ్ సమీపంలోని ఇండియన్ వన్‌ ATM మిషన్‌ నుంచి వెయ్యి తీసుకుందామనుకునే వాళ్లకు 6 నుంచి 10 వేలు వచ్చిపడ్డాయి. మేటర్‌ మౌత్ పబ్లిసిటీ కావడంతో.. అందరూ ఎగబడి ATM ఖాళీ చేశారు. వ్యవహారం పోలీసుల వరకు వెళ్లగా.. ATM రిపేర్‌ చేసేవాళ్లను తీసుకొచ్చారు. ATMలో ఉన్న 2 వందలు, 5 వందల నోట్లన్నీ ఖాళీ అయ్యాయి. మిషన్‌లో టెక్నికల్ ప్రాబ్లమ్‌ వల్లే డబ్బులు ఎక్కువగా బయటికి వచ్చాయని రిపేర్‌ చేసినవాళ్లు చెప్పారు. మొత్తానికి అలా.. ATM కరుణించడంతో మెషిన్‌లో ఉన్న 8 లక్షలు జనం జేబులో వేసుకున్నారు. అంతా అయ్యాక.. కొందరు తమ లక్‌ కూడా ట్రై చేద్దామని వచ్చి.. డిజప్పాయింట్‌ అయ్యారు.

Tags

Read MoreRead Less
Next Story