సంక్రాంతి పండుగ విశిష్టత

పాల పొంగులు రంగవల్లుల తోరణాలు
పల్లెసీమల్లో ఆనందాల హరివిల్లు
ఆత్మీయ పలకరింపులతో ఇంటింటా సంతోషాలు
సంస్కృతీ సంప్రదాయాలకు సంక్రాంతి శోభ
భారతీయ పండుగలన్నీ ప్రకృతితో ముడి పడి ఉంటాయి. ప్రకృతిని, కాలగమనాన్ని ఆచరిస్తాయి. అందులో సంక్రాంతి పండుగ అత్యంత విశిష్టమైనది. మిగిలిన పండుగలన్నీ చాంద్రమానాన్ని అనుసరించి వస్తే, సంక్రాంతి మాత్రం సౌరగమనాన్ని అనుసరించి వస్తుంది. పైగా, ఉత్తరాయణ పుణ్యకాలంలో మకర సంక్రమణంతో సంక్రాంతి వెలుగులు ఇంటింటా ప్రసరిస్తాయి. ఆదిశంకరాచార్యుడు ఇదే రోజున సన్యాసం పుచ్చుకున్నాడని చెబుతారు. పవిత్ర ధనుర్మాస వ్రతానికి ముగింపు పలికేది కూడా సంక్రాంతి రోజునే. ఆ రోజున గోదా కళ్యాణం చేసి వ్రతాన్ని పరిసమాప్తి చేస్తారు. ఎన్నో విశిష్టతలు ఉన్నాయి కాబట్టే ఈ పండుగను పెద్ద పండుగ అని గర్వంగా చెప్పుకుంటారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com