ఉపవాస దీక్ష విరమించిన రాజధాని రైతులు

ఉపవాస దీక్ష విరమించిన రాజధాని రైతులు

fasting

రాజధాని రైతులు ఉపవాస దీక్షను విరమించారు. అమరావతి పరిరక్షణ ఉద్యమంలో భాగంగా సంక్రాంతి పండుగ రోజు పస్తులు ఉండాలని రైతులు, మహిళలు నిర్ణయించారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పస్తులున్నారు. మందడం, వెలగపూడి, తుళ్లూరులో రైతులు, మహిళలు ఉపవాసం ఉన్నారు. రాజధాని విషయంలో ప్రభుత్వం దిగొచ్చేదాకా తమ ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేశారు. 29 గ్రామాల్లో ఉద్యమం మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. సంక్రాంతి రోజు కూడా నవులూరు, నిడమర్రు, ఎర్రబాలెంసహా అన్ని గ్రామాల్లోనూ నిరసనలు కొనసాగాయి.

Tags

Next Story