ఆంధ్రప్రదేశ్

తూర్పుగోదావరిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం

తూర్పుగోదావరిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం
X

accident

పండగ వేళ తూర్పు గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రావులపాలెం 16వ నెంబర్‌ జాతీయ రహదారిపై రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు.

రావులపాలెం వైపు నుంచి విజయవాడ వైపు వెళ్తున్న కారు.. తణుకు నుండి వస్తున్న మరొక కారు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని హైవే అంబులెన్స్‌లో కొత్తపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Next Story

RELATED STORIES