కాయ్ రాజా కాయ్.. కోళ్ల పందాలు.. కాదు కోట్ల పందాలు

కాయ్ రాజా కాయ్.. కోళ్ల పందాలు.. కాదు కోట్ల పందాలు

cock-f

తూర్పుగోదావరి జిల్లాలో కోడిపందేల జోరు కొనసాగుతోంది. సందట్లో సడేమియా అన్నట్టు కోడి పందేల ప్రాంతంలో బౌన్సర్లని పెట్టి గుండాట నడిపిస్తున్నారు. జూదగాళ్లకు ఎలాంటి ఇబ్బందులూ రాకుండా సౌకర్యాలూ ఏర్పాటు చేశారు. అక్కడే మద్యం, గుట్కా, సిగరెట్‌ అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. రామచంద్రాపురం మండలం ఏరుపల్లిలో యర్రంశెట్టి సర్వేశ్వర్రావుకి చెందిన 10 ఎకరాల లేఅవుట్‌లో పందాలను టాప్ లెవెల్లో ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతం చుట్టు 20కి పైగా గుండాట, పేకాట బోర్డులు వేసి కాయ్ రాజా కాయ్ అంటూ పందెం కడుతున్నారు.

ఇదిలా ఉంటే గుట్కా, సిగరెట్ పాకెట్లు చిన్న పిల్లలతో అమ్మిస్తుండడం టీవీ5 కెమెరాకి చిక్కాయి. పిల్లలతో ఇలాంటి పనులు చేయించడం నేరం కదా అని ఎవరైనా ప్రశ్నిస్తే.. దిక్కున్నచోట చెప్పుకో.. మాది అధికార పార్టీ అంటూ దురుసు సమాధానం ఇస్తున్నారు. ఇదంతా వైసీపీ నాయకుడు పట్నాల గణపతిరావు కనుసన్నల్లో జరుగుతుండడంతో.. పోలీసులు అటువైపు తొంగి చూడటంలేదు. పోలీసుల తీరు విమర్శలకు తావిస్తోంది.

పందెం రాయుళ్లు బరితెగించి మరీ కోడి పందాలు నిర్వహిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రజా ప్రతినిధులు, ప్రముఖుల అండ చూసుకుని పందెం రాయుళ్లుకోళ్ల కాళ్లకు కత్తులు కట్టి బరుల్లోకి వదులుతున్నారు. ఇంత జరుగుతున్నా.. పోలీసులు మాత్రం ఆ వైపుకి కన్నెత్తి కూడా చూడటం లేదు. పందేల పేరు చెప్పి జిల్లా వ్యాప్తంగా కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నా యి. మండపేట, రామచంద్రపురం నియోజకవర్గాల్లో ఫ్లడ్ లైట్ల వెలుగులో కొళ్ల కత్తులు కట్టి పందాలు నిర్వహిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story