కొనసాగుతున్న బీజేపీ-జనసేన భేటీ

కొనసాగుతున్న బీజేపీ-జనసేన భేటీ

JANASENA

బీజేపీ-జనసేన నేతల భేటీ కొనసాగుతోంది. రాజధాని అంశం, ప్రజాసమస్యలపై ఎలా ఉమ్మడిగా ముందుకు వెళ్లాలనేదానిపై ఇరు పార్టీల నేతలు చర్చిస్తున్నారు. విజయవాడ మురళీ ఫార్చ్యూన్‌ హోటల్‌లో జరుగుతున్న ఈ కీలక భేటీకి ఇరు పార్టీలకు చెందిన ముఖ్య నేతలు హాజరయ్యారు. జనసేన తరపున ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌, నాదెండ్ల మనోహర్‌ హాజరుకాగా.. బీజేపీ నుంచి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, జీవీఎల్, పురంధేశ్వరి, సోము వీర్రాజు, సునీల్‌ దేవధర్‌తో పాటు ఇతర నేతలు హాజరయ్యారు.

ఇరు పార్టీల నేతలు ఉమ్మడి కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఇప్పటికే రాజధాని ఉద్యమం రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న నేపథ్యంలో.. ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. ఈ సమావేశం తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు ఇరు పార్టీల మీడియా సమావేశం ఉంటుంది. రాజధాని అమరావతి అంశం, ప్రజాసమస్యలపై పోరాటంలో కలిసి పనిచేయడంపై రెండు పార్టీలు కీలక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది.

Tags

Next Story