తనకు తానే పోటీ.. రెండోసారి గిన్నిస్ రికార్డ్.. చూస్తే కళ్లు పట్టవు

తనకు తానే పోటీ.. రెండోసారి గిన్నిస్ రికార్డ్.. చూస్తే కళ్లు పట్టవు

LONG-HAIR

పొడవైన జుట్టుతో గిన్నీస్‌ రికార్డులోకి ఎక్కింది గుజారాత్‌ అమ్మాయి. అరవిల్లి ప్రాంతానికి చెందిన 17ఏళ్ల నిలాంశి పటెల్‌.. గిన్నీస్‌ రికార్డులో తన రికార్డు తానే తిరగరాసింది. ప్రపంచంలోనే అతి పొడవైన జుట్టు ఉన్న యువతిగా నిలాంశి రెండోసారి రికార్డు సాధించింది. 2018లో 170.5 సెంటీమీటర్లతో నిలాంశికి గిన్నీస్‌ రికార్డు వచ్చింది.

తాజాగా 190 సెంటీమీటర్లతో తన రికార్డును తనే తిరగరాసి మరోసారి గిన్నీస్‌ రికార్డుల్లోకి ఎక్కింది నీలాంశి. తనకు గిన్నీస్‌ రికార్డు రావడంపై సంతోషం వ్యక్తం చేస్తోంది నీలాంశి. తాను ఎక్కడికి వెళ్లినా... జనం సెల్ఫీలు తీసుకుంటారని, ఇదంతా చూస్తుంటే.. తాను ఓ సెలబ్రిటీని అనిపిస్తుందంటోంది

Tags

Next Story