వైసీపీ విషప్రచారాన్ని బయటపెట్టిన ఈ మెయిల్.. రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు

అమరావతిలో నిర్మాణాలు సురక్షితం కాదంటూ.. వైసీపీ నాయకులు చేస్తున్న ప్రచారం అబద్ధమని తేలిపోయింది. తాము అలాంటి నివేదిక ఏదీ ఇవ్వలేదంటూ మద్రాస్ ఐఐటీ స్పష్టంచేసింది. ఈమేరకు అమరావతి రైతులకు మద్రాస్ ఐఐటీ పెద్దలు ఇ-మెయిల్ పంపారు. అమరావతిలో నిర్మాణాలు సురక్షితం కాదని తాము చెప్పలేదని మద్రాస్ ఐఐటీ స్పష్టం చేసింది. అక్కడి నేలలో బలం లేదని నివేదిక ఇచ్చామనడం అబద్ధమని అందులో తెలిపింది.
రాజధానిగా అమరావతి సురక్షితం కాదని నివేదిక ఇచ్చారా అంటూ ఐఐటీ మద్రాస్‌కు రైతులు మెయిల్ పంపగా.. అటు నుంచి జవాబు వచ్చింది. తాము రిపోర్ట్ ఇచ్చామనడాన్ని ఐఐటీ పెద్దలు తీవ్రంగా ఖండించారు. ఇప్పుడీ ఇ-మెయిల్ రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. అమరావతిపై నెగెటివ్ ప్రచారం చేయాలనుకున్న ప్రభుత్వ వ్యూహం మరోసారి బెడిసి కొట్టిందని అమరావతి జేఏసీ నేతలు అన్నారు. అమరావతిలో నిర్మాణాలకు ఎక్కువ ఖర్చు అవుతుందని.. భారీ నిర్మాణాలు కష్టమంటూ ఐఐటీ-మద్రాస్ పేరుతో మంత్రులు చేసిన ప్రకటనలు అవాస్తవం అని తేలిపోయిందని రైతులు అంటున్నారు.
RELATED STORIES
Rocketry Review: 'రాకెట్రీ ది నంబి ఎఫెక్ట్' మూవీ రివ్యూ.. మాధవన్ లెక్క ...
1 July 2022 10:45 AM GMTPakka Commercial Review: 'పక్కా కమర్షియల్' రివ్యూ.. సినిమాలో హైలెట్...
1 July 2022 9:15 AM GMT777 Charlie Review: '777 చార్లీ' రివ్యూ.. మనసుకు హత్తుకుపోయే పెట్ కథ..
10 Jun 2022 12:00 PM GMTAnte Sundaraniki Review: 'అంటే.. సుందరానికీ' మూవీ రివ్యూ.. నాని,...
10 Jun 2022 8:51 AM GMTVikram Movie Review: 'విక్రమ్' మూవీ రివ్యూ.. ఇట్స్ ఏ ఫోర్ మ్యాన్ షో..
3 Jun 2022 9:41 AM GMTAshoka Vanamlo Arjuna Kalyanam Review: 'అశోకవనంలో అర్జున కళ్యాణం' ఎలా...
6 May 2022 3:41 AM GMT