ఒడిశాలో పట్టాలు తప్పిన ఎల్‌టీటీ.. 50కి పైగా..

ఒడిశాలో పట్టాలు తప్పిన ఎల్‌టీటీ.. 50కి పైగా..

TRAIN

ముంబై నుంచి భువనేశ్వర్ వెళ్తున్న LTT ఎక్స్‌ప్రెస్‌ ప్రమాదానికి గురైంది. ఒడిశాలోని నిర్గుండి వద్ద ఆరు బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో 50 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. పొగమంచు కారణంగా ప్రమాదం జరిగినట్టు ప్రాథమికంగా అంచనా వేశారు. సమాచారం అందిన వెంటనే రైల్వే అధికారులు, సిబ్బంది, పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై పూర్తిస్థాయి విచారణ చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story