53 ఏళ్ల వయసులో కూడా ఏం ఫీట్లు.. వీడియో

53 ఏళ్ల వయసులో కూడా ఏం ఫీట్లు.. వీడియో

vijayasanthi1

లేడీ సూపర్‌స్టార్, లేడీ అమితాబ్.. విజయశాంతికి ఫ్యాన్స్ ఇచ్చుకున్న బిరుదులు. ఆమెకు ఆ ట్యాగ్స్ ఎప్పటికి వర్కవుట్ అవుతాయి. ఎందుకంటారా.. 53 ఏళ్ల వయసులో ఈ మాజీ హీరోయిన్ చేసిన ఫీట్ చూస్తే మీరు అదే మాట అనడం ఖాయం. ఇటీవలే ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీతో వెండితెరకు రీ ఎంట్రీ ఇచ్చింది రాములమ్మ. ప్రొఫెసర్ పాత్రలో ఎవర్‌గ్రీన్ ఎమోషన్స్‌ను పండించింది. ఈ చిత్ర షూటింగ్ సమయంలో తీసిన ఓ రేర్ వీడియోను మూవీ డైరెక్టర్ అనిల్ రావిపూడి ట్విట్టర్‌లో ఫోస్ట్ చేశారు.

మరో నటుడు బ్రహ్మజీకి కాలితో కిక్ ఇస్తోన్న లేడీ అమితాబ్ వీడియో చూస్తే..అప్పట్లో ఆమె చేసిన యాక్షన్ స్టంట్స్ గుర్తుకువస్తాయి. ఈ వీడియో విజయశాంతి అభిమానులను ఓ రేంజ్‌లో మెస్మరైజ్ చేస్తోంది. ఇన్నేళ్లు గడిచినా ఆమెలో అదే గ్రేస్, అదే మాస్ అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు.

Read MoreRead Less
Next Story