మేడమ్ ఆఫ్ కామాటిపుర..

మేడమ్ ఆఫ్ కామాటిపుర..

Alia-Bhat

చిన్నతనంలోనే వ్యభిచార కూపంలోకి నెట్టబడి కాలక్రమంలో మేడమ్ ఆఫ్ కామాటిపురాగా మారిన గంగూబాయ్ కతియావాడి జీవితాన్ని తెరకెక్కిస్తున్నారు బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ. గంగూబాయ్‌గా బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ నటిస్తోంది. భన్సాలీ దర్శకత్వంలో నటించాలన్న తన చిన్ననాటి కోరికను ఈ చిత్రంతో నెరవేర్చుకోబోతోంది ఆలియా. ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్ పోస్టర్‌ని రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఆలియా లుక్స్‌ని చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఏమాత్రం పోల్చుకోవడానికి లేదు. దీన్ని బట్టి తన పాత్ర ఎంత స్ట్రాంగ్‌గా ఉంటుందో అర్థమవుతుందని అంటున్నారు. ఆలియా లుక్స్‌కి బాలీవుడ్ ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. బలం.. అధికారం.. భయం.. ఒక్క చూపు.. వేల భావోద్వేగాలు అంటూ ఆలియా లుక్‌ను ట్విట్టర్‌లో షేర్ చేసింది భన్సాలీ ప్రొడక్షన్. ఈ చిత్రం సెప్టెంబర్ 11న విడుదల కానుంది.

Read MoreRead Less
Next Story