అల.. వైకుంఠపురం ఇల్లు.. ఇలలోనే.. ఇక్కడే..

అల.. వైకుంఠపురం ఇల్లు.. ఇలలోనే.. ఇక్కడే..

అబ్బ.. ఇల్లు ఎంత బావుందో.. ఎక్కడ షూట్ చేశారు. సినిమా చూసిన ప్రతి ఒక్కరు అల్లు అర్జున్ పాటలు.. త్రివిక్రమ్ మాటలు చూసి ఎంజాయ్ చేయడమే కాదు.. సినిమాలో చూపించిన ఇంటిని చూసి కూడా మురిసి పోయారు. ఆ ఇంటిని గురించి, ఇంటి అందం గురించి ముచ్చటించుకున్నారు. అల వైకుంఠపురం ఇలలోనే ఉంది.. అదీ హైద్రాబాదులోనే ఉందీ అని తెలిసి ఆశ్చర్యపోతున్నారు.

vikuntapuram

తాజాగా దీనిపై ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఆ ఇల్లు ఓ మీడియా సంస్థ యజమాని కూతురు అత్తవారి ఇల్లుగా చెబుతున్నారు. నగరంలోని జుబ్లీహిల్స్‌లో ఉన్న ఈ ఇంటిలోనే 20 రోజుల పాటు షూటింగ్ చేశారట. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఓసారి వారి ఇంటికి వెళ్లినప్పుడు ఇల్లు చాలా బావుంది. మా సినిమా షూటింగ్ మీ ఇంట్లో చేసుకుంటాం అని అనేసరికి కాదనలేకపోయారట ఇంటి యజమానులు. అదే వైకుంఠపురం. అల్లు అర్జున్ కూడా కట్టుకుంటే అలాంటి ఇల్లే కట్టుకోవాలని అనుకున్నాడట. అందుకోసం ప్రయత్నాలు ఇప్పటికే ప్రారంభించేశాడు.. ఇంటికి సంబంధించి భూమి పూజ కూడా చేసేసాడు.

Read MoreRead Less
Next Story