సుప్రీం కోర్టు ఆదేశాలు ఎందుకు పాటించలేదు.. అమరావతి పోలీసులకు హైకోర్టు ప్రశ్న
అమరావతిలో మహిళల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మహిళలపై మగ పోలీసులు ఎందుకు దాడి చేశారని అడ్వకేట్ జనరల్‌ను న్యాయమూర్తి నిలదీశారు. ఏ కారణంతో 610 మందిని అరెస్ట్ చేశారని.. మహిళపై కాలుతో దాడి చేయడం ఏంటని.. మహిళ నోరు నొక్కే అధికారం పోలీసులకు ఎవరిచ్చారని.. ఇలా వరుస ప్రశ్నల వర్షం కురిపించారు.. రాజధానిలో 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ 30 అమలుపై గంటన్నరకు పైగా సాగిన విచారణను సోమవారానికి వాయిదా వేసింది ఏపీ హైకోర్టు
అమరావతి గ్రామాల్లో పోలీసులు పరేడ్ ఎందుకు చేశారని అడ్వకేట్ ను జస్టిస్ నిలదీశారు. గ్రామంలో ఎంతమంది పోలీసులు మార్చ్ ఫాస్ట్ నిర్వహించారు. అక్కడ ఎంత జనాభా ఉందని జస్టిస్ ప్రశ్నించారు. ఏ రూల్ ప్రకారం మందడంలో మార్చ్ ఫాస్ట్ చేశోరా చెప్పాలని నేరుగా అడ్వకేట్ జనరల్ ను ప్రశ్నించారు. అయితే ప్రస్తుతం అమరావతిలో పరిస్థితులు ప్రశాంతంగానే ఉన్నాయని అడ్వకేట్ జనరల్ వివరించారు. దీనిపై స్పందించిన కోర్టు.. ఇంకా అక్కడ ఎందుకు పోలీసులు ఉన్నారని ప్రశ్నించింది.
ఆందోళనల్లో గాయపడ్డ మహిళ పరిస్థితి ఎలా ఉందని న్యాయమూర్తి ఆరా తీశారు. ఆమె మెడికల్ రిపోర్ట్స్ ఉన్నాయా అని అడిగారు. జమ్ము కశ్మీర్లో మినహా ఎక్కడా 144, 30 యాక్ట్ అమలు చేయొద్దని సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలను ఎందుకు పాటించలేదని నిలదీసింది. అసలు ఒక పౌరుడ్ని అడ్డుకునే హక్కు పోలీసులకు ఎక్కడదని.. దీనిపై వెంటనే వివరణ ఇవ్వాలని కోరగా.. ప్రమాణ పత్రం దాఖలు చేయడానికి ప్రభుత్వ అడ్వకేట్ జనగర్ శ్రీరామ్ కొంత సమయం కోరారు. దీంతో విచారణను సోమవారానికి వాయిదా వేసింది కోర్టు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com