17 Jan 2020 11:47 AM GMT

Home
 / 
ఆంధ్రప్రదేశ్ / గవర్నర్ బిశ్వభూషణ్‌ను...

గవర్నర్ బిశ్వభూషణ్‌ను కలిసిన జేఏసీ నేతలు

గవర్నర్ బిశ్వభూషణ్‌ను కలిసిన జేఏసీ నేతలు
X

JAC

అమరావతి పరిరక్షణ సమితి నేతృత్వంలో 20 సంఘాల నాయకులు ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్‌ ను కలిశారు. రాజధాని మార్పు నిర్ణయంపై ప్రభుత్వం వెనక్కు తగ్గేలా చొరవ తీసుకోవాలని గవర్నర్‌ను కోరారు. రాజధాని ప్రాంత ప్రజలు, రైతులు పడుతున్న ఇబ్బందులను గవర్నర్ కు వివరించారు. శాంతియుతంగా ర్యాలీ చేస్తున్న తమపై పోలీసులు నిరంకుశత్వంగా దాడులు చేస్తున్నారని గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. అమరావతిలో సెక్షన్ 144, పోలీస్ యాక్ట్ 30 అమల్లో వున్నాయంటూ.. పోలీసులు తీవ్రమైన ఇబ్బందులు పెడుతున్నారని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన వైఖరి తెలిపాలని డిమాండ్ చేశారు.

Next Story