ఈ ఏడాది డిమాండ్ ఉన్న కొత్త ఉద్యోగాలు..

ఈ ఏడాది డిమాండ్ ఉన్న కొత్త ఉద్యోగాలు..

jobs

కస్టమర్ సక్సెస్ స్పెషలిస్ట్ ఉద్యోగాలకు ప్రస్తుతం మంచి డిమాండ్ ఉంది. ముంబై, ఢిల్లీలో అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కస్టమర్ రిలేషన్‌షిప్ మేనేజ్‌మెంట్, టీమ్ మేనేజ్‌మెంట్, కస్టమర్ రిటెన్షన్, అకౌంట్ మేనేజ్‌మెంట్ లాంటి బాధ్యతలు ఉంటాయి.

రోబోటిక్స్ ఇంజనీర్‌కు సాప్ట్‌వేర్, హార్డ్‌వేర్ విభాగాల్లో మంచి డిమాండ్ ఉంది. వర్బువల్, ఫిజికల్ బాట్స్‌వల్ల ఉపయోగాలు ఎక్కువగా ఉంటున్నాయి. వీరికి బెంగళూరు, గురుగ్రాం, చెన్నై లాంటి పట్టణాల్లో మంచి

డిమాండ్ ఉంది. రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్, యూఐపాథ్, బ్లూ ప్రిస్మ్, ఆటోమేషన్ ఎనీవేర్, రోబోటిక్స్, ఎస్‌క్యూఎల్ లాంటి బాధ్యతలు ఉంటాయి.

ఫుల్‌స్టాక్ ఇంజనీర్లకు డిమాండ్ ఎక్కువగా ఉంది. వీరికి బెంగళూరు, హైదరాబాద్, ముంబై ప్రాంతాల్లో మంచి అవకాశాలు ఉన్నాయి. జావాస్క్రిప్ట్, AngularJS, Node,js, Java Script, React.js, MongoDB వంటి కోర్సులు చేసిన వారికి ఈ ఉద్యోగాలు ఉంటాయి.

సైట్ రిలయబిలిటీ ఇంజనీర్ ఉద్యోగాలకు హైదరాబాద్, బెంగళూరు, పూణెలో అవకాశాలు ఉంటాయి. అమెజాన్ వెబ్ సర్వీసెస్, అన్సిబుల్, డాకర్ ప్రొడక్ట్స్‌లలో నైపుణ్యాలు ఉన్నవారికి అవకాశం ఉంటుంది.

బ్యాక్ ఎండ్ డెవలపర్లకు బెంగళూరు, గురుగ్రామ్, ముంబై లాంటి ప్రాంతాల్లో డిమాండ్ ఉంది. వీరికి కూడా Node,js, Java Script, React.js, MongoDB, Django MySQL లాంటి నైపుణ్యాలు ఉండాలి.

రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ కన్సల్టెంట్ ఉద్యోగాలకు బెంగళూరు, ముంబైలో డిమాండ్ ఉంది. ఆటోమేషన్ ఎనీవేర్, బ్లూప్రిస్మ్, ప్రాసెస్ ఆటోమేషన్, ఎస్‌క్యూఎల్ కు సంబంధించిన వాటిల్లో నైపుణ్యం ఉండాలి.

జావాస్క్రిప్ట్ డెవలపర్ ఉద్యోగాలకు హైదరాబాద్ బెంగళూరు, ముంబైలో డిమాండ్ ఉంది. వీరికి AngularJS, Node,js, Java Script, React.js, MongoDB వంటి వాటిల్లో నైపుణ్యం ఉండాలి.

ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ స్పెషలిస్ట్‌కు హైదరాబాద్, పూణె, బెంగళూరులో డిమాండ్ ఉంది. వీరికి మెషీన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, టెన్సార్‌ప్లో, పైథాన్, ఎన్‌ఎల్‌పీ నైపుణ్యాలు తెలిసి ఉండాలి.

బ్లాక్ చెయిన్ డెవలపర్ ఉద్యోగాలకు కూడా మంచి డిమాండ్ ఉంది. వీరికి Hyperledger, Solidity, Node.js, Smart Contract నైపుణ్యాలు ఉండాలి.

Read MoreRead Less
Next Story