క్యాబ్‌ డ్రైవర్ అసభ్య ప్రవర్తనతో..

క్యాబ్‌ డ్రైవర్ అసభ్య ప్రవర్తనతో..

sonam-kapoor

అత్యవసర పరిస్థితుల్లో క్యాబ్‌లలో ప్రయాణించక తప్పదు. క్యాబ్ డ్రైవర్ల ప్రవర్తన ఒక్కోసారి మహిళలను ఇబ్బంది పెట్టేదిగా ఉంటుంది. దీంతో రాత్రి సమయాల్లో క్యాబ్ ఎక్కాలంటేనే భయపడిపోతుంటారు. సాధారణ మహిళ మాత్రమే ఇలాంటి పరిస్థితులు ఎదుర్కుంటుందనుకుంటే పొరపాటే. సెలబ్రిటీలు కూడా ఇందుకు అతీతులు కారు. తాజాగా బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ తనకు ఎదురైన అనుభవం గురించి చెప్పుకొచ్చింది. లండన్ వెళ్లినప్పుడు క్యాబ్ ఎక్కాల్సి వచ్చింది. డ్రైవర్ తన గురించి అసభ్యంగా మాట్లాడాడడని, పెద్దగా అరిచాడని వివరించింది.

దీంతో భయపడిపోయిన తాను క్యాబ్ దిగిపోయానని చెప్పుకొచ్చింది. ప్రజా రవాణా వ్యవస్థకు సంబంధించిన వాహనాల్లో ప్రయాణించడమే అత్యంత శ్రేయస్కరమని సోనమ్ వివరించింది. ఇదిలా ఉండగా క్యాబ్ డ్రైవర్లపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో.. ఉబర్ ముందు జాగ్రత్త చర్యగా తన యాప్‌లో కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించింది. వాయిస్ ఆడియో రికార్డింగ్ అనే ఫీచర్ ద్వారా డ్రైవర్, ప్రయాణీకుల మధ్య జరిగే సంభాషణలను ఎప్పటికప్పుడు రికార్డు చేయనున్నామని పేర్కొంది.

Read MoreRead Less
Next Story