ఆంధ్రప్రదేశ్

తుళ్లూరులో అసైన్డ్‌ రైతులు భారీ ర్యాలీ

తుళ్లూరులో అసైన్డ్‌ రైతులు భారీ ర్యాలీ
X

rallyరాజధాని గ్రామాల్లో 32వ రోజు నిరసనలు హోరెత్తుతున్నాయి. తుళ్లూరులో అసైన్డ్‌ రైతులు భారీ ర్యాలీ చేపట్టారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో రద్దు చేయాలని.. తమకు భూములు అమ్ముకునే హక్కు కల్పించాలని కోరారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ.. తుళ్లూరు ఆర్టీసీ బస్టాండ్ నుంచి CRDA ఆఫీస్ వరకూ ఎస్సీ, ఎస్టీ రైతులు, మహిళలు ర్యాలీ చేపట్టారు.

మరోవైపు రాజధాని అమరావతిని తరలించొద్దంటూ మందడంలో మహిళలు, రైతులు ర్యాలీ చేపట్టారు. రహదారిపై బైఠాయించారు. టెంట్‌ వేసుకోవడానికి పోలీసులు అనుమతివ్వకపోవడంతో ఎండలోనే నిరసనకు దిగారు.

Next Story

RELATED STORIES