విజయవాడలో అమరావతి జేఏసీ భారీ క్యాండిల్ ర్యాలీ

X

అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ.. 29 గ్రామాల రైతులు నిరసనలు కొనసాగిస్తున్నారు. విజయవాడలో అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. BRTS రోడ్డులో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొంటున్నారు. ప్రభుత్వం వెంటనే తన నిర్ణయాన్ని మార్చుకోవాలని.. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా పెదకూరపాడు మండలం గారపాడులో సైతం రైతులు భారీ క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. మూడు రాజధానులు వద్దు అమరావతి ముద్దు అంటూ నినాదాలు చేశారు.
Tags
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
