కేంద్రం కొత్త రూల్.. ఇకపై బంగారం కొనాలంటే..
హాల్‌మార్క్ అంటే బంగారు వస్తువుల నాణ్యతకు, స్వచ్ఛతకు సంబంధించిన ఓ సింబల్. ఇకపై ఈ హాల్‌మార్క్ లేని వస్తువులు అమ్మితే భారీ జరిమానాతో పాటు జైలుకి కూడా వెళ్లాల్సి వస్తుందని అంటోంది కేంద్రం. ఇందుకు సంబంధించి కొత్త రూల్స్ తీసుకువచ్చింది. 2021 జనవరి 15 నుంచి హాల్‌మార్క్ లేని ఆభరణాలను విక్రయించడం కుదరదు. అందువలన జువెలరీ సంస్థలన్నీ ఈలోపు బీఐఎస్ రిజిస్ట్రేషన్ పొందాలి. పాత స్టాక్ ఏమైనా ఉంటే క్లియర్ చేసుకోవాలి. బంగారు ఆభరణాలకు హాల్‌మార్క్ మూడు రకాలుగా ఉంటుంది.
14 క్యారెట్, 18 క్యారెట్, 22 క్యారెట్ అని హాల్‌మార్క్‌ను కేటగిరిల్లో డివైడ్ చేస్తారు. హాల్‌మార్కింగ్ వల్ల కస్టమర్లు వారు కొనే ఆభరణాల స్వచ్ఛత గురించి పూర్తిగా తెలుసుకోవచ్చు. మోసపోయే అవకాశం ఉండదు. గోల్డ్ జ్యువెలరీకి సంబంధించి నాలుగు రకాల హాల్‌మార్కులు ఉంటాయి. వాటిలో బీఐఎస్ మార్క్, ప్యూరిటీ (క్యారెట్), హాల్‌మార్క్ సెంటర్ నేమ్, జువెలర్స్ ఐడెంటిఫికేషన్ మార్క్ అనే అంశాలను హాల్‌మార్క్‌లో చూడొచ్చు. బంగారు నగలు కొనే కస్టమర్లు మోసపోవద్దనే ఉద్యేశంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com