సీఆర్డీఏపై సీఎం జగన్ కీలక సమీక్ష

సీఆర్డీఏపై సీఎం జగన్ కీలక సమీక్ష

ap-cm-ys-jagan

సీఆర్డీఏపై సీఎం జగన్ కీలక సమీక్ష నిర్వహించారు. సోమవారం అసెంబ్లీ సమావేశాల్లో రాజధానిపై నిర్ణయం తీసుకోనున్న నేపథ్యంలో.. సీఆర్డీఏ బిల్లుపై న్యాయ, సాంకేతికపరమైన అడ్డంకులు రాకుండా ఎలా వ్యవహరించాలన్న దానిపై దృష్టిపెట్టారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, ప్రభుత్వ చీఫ్‌విప్‌ శ్రీకాంత్‌రెడ్డితో ఈ అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. మూడు రాజధానులపై ఇప్పటికే హైపవర్‌ కమిటీ సీఎంతో సమావేశమై చర్చించింది. సీఆర్డీఏ చట్టం రద్దును ఆర్థిక బిల్లుగా పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. రాజధానులపై అసెంబ్లీలో సోమవారం బిల్లు ప్రవేశపెట్టాలంటే ముందుగా గవర్నర్‌ అనుమతి తీసుకోవాలి. అంటే ఉదయం 9 గంటలకు మంత్రిమండలి ఆమోదిస్తే గవర్నర్‌కు పంపి ఆయన అనుమతి తీసుకుని మళ్లీ 11 గంటలకు శాసనసభలో బిల్లు పెట్టాలి. ఇది కొంత హడావుడితో కూడిన వ్యవహారమే అయినా.. సభ సమావేశం అయ్యేప్పటికల్లా ఎక్కడా ఇబ్బందుల్లేకుండా చూసుకుంటూ ముందుకెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది.

Tags

Next Story