ఆంధ్రప్రదేశ్

తుళ్లూరులో తీవ్ర ఉద్రిక్తత.. సెల్‌ టవర్‌ ఎక్కిన రాజధాని ప్రాంత రైతులు

తుళ్లూరులో తీవ్ర ఉద్రిక్తత.. సెల్‌ టవర్‌ ఎక్కిన రాజధాని ప్రాంత రైతులు
X

tower

అమరావతి గ్రామాల్లో ఆందోళనలు తారా స్థాయికి చేరాయి.. తుళ్లూరులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. రాజధాని ప్రాంత రైతులు సెల్‌ టవర్‌ ఎక్కి నిరసన తెలుపుతున్నారు.. రాజధానిని తరలించొద్దంటూ నినాదాలు చేస్తున్నారు.. అధికారులు హామీ ఇచ్చే వరకు టవర్‌ పైనుంచి దిగబోమంటున్నారు.. అటు ఊహించని ఈ ఘటనతో పోలీసులు అప్రమత్తమయ్యారు.. రైతులకు సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సెల్‌ టవర్‌ ఎక్కిన రాజధాని ప్రాంత రైతులు

అమరావతినే రాజధానిగా ప్రకటించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

రాజధాని కోసం ప్రాణ త్యాగానికి సైతం సిద్ధమని చెప్పారు. జై అమరావతి అంటూ టవర్‌ ఎక్కి రైతుల నినాదాలు చేస్తున్నారు. అధికారులు హామీ ఇచ్చే వరకు కిందకి దిగమని చెప్పడంతో పెద్ద సంఖ్యలో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. రైతులకు సర్ది చెప్పేందుకు పోలీసుల ప్రయత్నాలు చేస్తున్నా వారి మాట వినడం లేదు. కాగా ఆ నలుగురు రైతులు తుళ్లూరు గ్రామానికి చెందిన వారుగా తెలుస్తోంది. గతంలో వైసీపీ తరపున క్రియాశీలకంగా పనిచేశారు. తాము కష్టపడి గెలిపించిన స్థానిక ఎమ్మెల్యే వచ్చి తమ డిమాండ్‌ను పరిష్కరించాలని వారు అంటున్నారు.

Next Story

RELATED STORIES