ఆంధ్రప్రదేశ్

తాడేపల్లి గూడెంలో వేడెక్కిన రాజకీయం.. జనసేన నాయకులను అరెస్ట్ చేసిన పోలీసులు

తాడేపల్లి గూడెంలో వేడెక్కిన రాజకీయం.. జనసేన నాయకులను అరెస్ట్ చేసిన పోలీసులు
X

pavanan

పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలో రాజకీయం వేడెక్కింది. జనసేన నాయకుడు మారిశెట్టి పవన్ బాలాజీని పోలీసులు అరెస్టు చేశారు. ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణపై ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టారంటూ అదుపులోకి తీసుకున్నారు. దీంతో.. జనసేన నాయకులు పీఎస్‌కు వెళ్లారు. పోలీసుల వైఖరికి వ్యతిరేకంగా అక్కడే బైఠాయించారు. మాజీ మంత్రి మాణిక్యాలరావు కూడా పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. పోలీసులతో మాట్లాడారు. ఇటు.. పోలీస్ స్టేషన్ బయట జనసేన నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో గుమికూడారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం జనసేన నాయకులను పోలీసులు విడిచిపెట్టారు.

Next Story

RELATED STORIES