మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన జేసీ ప్రభాకర్ రెడ్డి
BY TV5 Telugu18 Jan 2020 10:18 AM GMT

X
TV5 Telugu18 Jan 2020 10:18 AM GMT
తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీసుల ఓవరాక్షన్ రోజురోజుకూ పెరుగుతోందని... ఇంతకాలం ఓపిక పట్టామని.. ఇకపై సహించేది లేదంటూ మండిపడ్డారు. ప్రబోధానంద కేసు విషయంలో టీడీపీ కార్యకర్తలు,నాయకులపై పోలీసులు అక్రమ కేసులు బనాయిస్తూ వేధిస్తున్నారని ఆరోపించారు. తాడిపత్రిలో తాము అధికారంలోకి రాకూడదని ప్రార్థించాలని ఒకవేళ వస్తే... తమ కార్యకర్తలపై కేసులు పెట్టిన పోలీసులను కూడా జైలుకు పంపిస్తామని అన్నారు.
Next Story