ఈ ఉద్యమం ఇక్కడితో ఆగదు : లోకేశ్

ఈ ఉద్యమం ఇక్కడితో ఆగదు : లోకేశ్

అమరావతి ఉద్యమాన్ని ఎంత అణచివేయాలనుకుంటే అంత ఎగసిపడుతుందన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌. ఈ ఉద్యమం ఇక్కడితో ఆగదన్నారు.. అమరావతిలో ఆందోళనలు చేస్తున్న రైతులకు మద్దతుగా ఉండవల్లిలో ప్రజా బ్యాలెట్‌ నిర్వహించారు. ఈ బ్యాలెట్‌ కార్యక్రమానికి హాజరైన ఆయన వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఏపీ రాజధాని ఏదని చెప్పుకోలేకుండా సీఎం చేశారని లోకేష్‌ ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని కోసం ఆందోళన చేస్తున్న రైతులపై అక్రమ కేసు పెట్టడాన్ని తప్పు పట్టారు.

Tags

Next Story