మున్సిపల్‌ ఎన్నికల్లో టీడీపీకి మద్దతుగా టీఆర్‌ఎస్‌ కార్యకర్తల ప్రచారం

మున్సిపల్‌ ఎన్నికల్లో టీడీపీకి మద్దతుగా టీఆర్‌ఎస్‌ కార్యకర్తల ప్రచారం

వికారాబాద్‌ మున్సిపల్‌ ఎన్నికల్లో... ఊహించని సంఘటనలు జరుగుతున్నాయి. వికారాబాద్‌ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు.. టీడీపీకి మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. బరిలో ఉన్న టీడీపీ కౌన్సిలర్ అభ్యర్థి చొప్పరి యాదయ్యకు మద్దతుగా.. టీఆర్‌ఎస్‌ నేతలు ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే తాము టీఆర్‌ఎస్‌కు, కేసీఆర్‌కు వ్యతిరేకం కాదని.. పార్టీకి సంబంధంలేని వ్యక్తులకు కౌన్సిలర్‌ అవకాశం ఇవ్వడాన్ని తప్పుబడుతున్నామన్నారు. డబ్బున్న వ్యక్తులకే టిక్కెట్లు ఇస్తున్నారని ఆరోపిస్తున్నారు. అందుకే టీడీపీ అభ్యర్థి కోసం ప్రచారం నిర్వహిస్తున్నామని చెప్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story