లండన్ సదస్సులో ప్రసంగిస్తూ కుప్పకూలిన నిమ్స్ డాక్టర్..

లండన్ సదస్సులో ప్రసంగిస్తూ కుప్పకూలిన నిమ్స్ డాక్టర్..

Dr.-Meena

హైదరాబాద్ నిమ్ప్ ఆసుపత్రిలో న్యూరో ఫిజీషియన్‌గా విధులు నిర్వహిస్తున్న సీనియర్ డాక్టర్ మీనా కుమారి లండన్ సదస్సుకు హాజరయ్యారు. అక్కడ సదస్సులో ఉపన్యసిస్తూ ఒక్కసారిగా గుండెపోటుకు గురై కుప్పకూలిపోయారు. హుటాహుటిన ఆసుపత్రికి తరలించి అత్యవసర శస్త్రచికిత్సలు జరిపారు. లండన్ వైద్యులు ఆమె గుండెకు మూడు స్టెంట్లు వేసారు. హార్ట్ ఫెయిలై దాని ప్రభావం మెదడుపై తీవ్రంగా పడినట్లు లండన్ వైద్యులు వెల్లడించారు. మీనాకుమారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమెను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు.

తమిళనాడుకు చెందిన మీనాకుమారి ఎన్నో ఏళ్ల క్రిందటే భాగ్యనగరానికి వచ్చి స్థిరపడ్డారు. గాంధీ ఆసుపత్రిలో ఎంబీబీఎస్, ఎండీ కోర్సులను పూర్తి చేశారు. నిమ్స్‌లో ఆమె 25 ఏళ్లుగా వైద్య సేవలు అందిస్తున్నారు. అంచెలంచెలుగా ఎదిగి ఫ్రొఫెసర్ స్థాయికి చేరుకున్నారు. లండన్ పౌరసత్వం కలిగిన ఓ డాక్టర్‌ని అక్కడికి పంపిస్తున్నట్లు నిమ్స్ డైరక్టర్ డాక్టర్ మనోహర్ తెలిపారు.

Read MoreRead Less
Next Story