షిరిడీలో కొత్త వివాదం.. సాయిబాబా ఆలయం మూసివేత

షిరిడీలో కొత్త వివాదం.. సాయిబాబా ఆలయం మూసివేత

Baba-mandir

అసలు బాబాగారు ఎక్కడ పుట్టారు.. మహారాష్ట్ర పర్బణీ జిల్లా పాథ్రీలో పుడితే ఇక్కడ ఎందుకు కట్టారు ఇదే ఇప్పుడు షిరిడీలో ఉన్న సాయిబాబా ఆలయం మూసివేతకు కారణమైంది. 1999లో శ్రీసాయి జన్మస్థాన్ మందిర్ వాళ్లు పాథ్రీలో ఆలయాన్ని నిర్మించి పూజలు నిర్వహిస్తున్నారు. అక్కడికి కూడా వేల సంఖ్యలో భక్తులు వస్తున్నారు. ఇప్పుడు ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తూ ఆలయ నిర్మాణానికి రూ.100 కోట్లు కేటాయిస్తున్నట్లు ఇటీవల ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ప్రకటించారు.

అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మాత్రం పాథ్రీలో సాయిబాబా ఆలయ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తోంది. ఇన్నాళ్లూ లేని అంశం ఇప్పుడెందుకు అని ముఖ్యమంత్రిపై విరుచుకుపడుతోంది. మరోపక్క షిరిడీ వాసులు కూడా పాథ్రీలో ఆలయాన్ని నిర్మిస్తే తమ ప్రాంత ప్రాధాన్యత తగ్గిపోతుందని ఆందోళన చేపడుతున్నారు. ఇన్ని వివాదాలు నెలకొన్న నేపథ్యంలో షిరిడీలోని బాబా ఆలయాన్ని ఈనెల 19నుంచి నిరవధికంగా మూసివేస్తున్నట్లు షిర్టీ సంస్తాన్ ప్రకటించింది. ప్రభుత్వంలో భాగమైన NCP, కాంగ్రెస్ పార్టీలు శివసేనకు మద్ధతు పలుకుతున్నాయి. పాథ్రీలో ఆలయ నిర్మాణానికి ఓటు వేస్తున్నాయి. మరి షిరిడీ వాసుల ఆందోళన ఎంతవరకు సాగుతుందో చూడాలి.

Read MoreRead Less
Next Story