ఆంధ్రప్రదేశ్

రేపు ఉదయం టీడీఎల్పీ సమావేశం.. ఎమ్మెల్యేలకు విప్ జారీ..

రేపు ఉదయం టీడీఎల్పీ సమావేశం.. ఎమ్మెల్యేలకు విప్ జారీ..
X

Screenshot_1టీడీపీ కూడా ప్రత్యేక వ్యూహాలను సిద్ధం చేస్తోంది.. సోమవారం ప్రభుత్వం నిర్వహించనున్న ప్రత్యేక అసెంబ్లీ సమావేశానికి టీడీపీ సిద్ధమవుతోంది.. రేపు ఉదయం 10.30కు గుంటూరు పార్టీ కార్యాలయంలో టీడీఎల్పీ సమావేశం జరగనుంది.. రాజధాని తరలింపు ప్రక్రియను వ్యతిరేకిస్తూ సభలో ఏయే అంశాలు ప్రస్తావించాలనే దానిపై టీడీఎల్పీలో చర్చ జరగనుంది.. టీడీఎల్పీ సమావేశం తర్వాత ముఖ్య నేతలతో స్ట్రాటజీ కమిటీ సమావేశం నిర్వహించనున్నారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు.. మరోవైపు అసెంబ్లీ సమావేశానికి సభ్యులంతా తప్పనిసరిగా హాజరు కావాలని పార్టీ అధిష్ఠానం విప్‌ జారీ చేసింది.. రెబల్‌ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీతోపాటు మద్దాలి గిరికి కూడా విప్‌ జారీ చేసింది.

Next Story

RELATED STORIES