18 Jan 2020 10:32 AM GMT

Home
 / 
అంతర్జాతీయం / అందంగా ఉంది.. అమ్మాయే...

అందంగా ఉంది.. అమ్మాయే కదా అని పెళ్లి చేసుకుంటే.. ఆమె కాదని తెలిసి..

అందంగా ఉంది.. అమ్మాయే కదా అని పెళ్లి చేసుకుంటే.. ఆమె కాదని తెలిసి..
X

uganda-marriage

మన కళ్లు మనల్ని మోసం చేస్తాయంటారు నిజమేనేమో.. తెల్లనివన్నీ పాలు, నల్లనివన్నీ నీళ్లు అని పొరబడుతుంటాము. బురఖా వేసుకుని నేల చూపులు చూడకుండా వాలు చూపులు చూస్తుంటే నా కళ్లని నేనే నమ్మలేకపోయాను. పల్చటి ఆ తెరలో పాలుగారే చెక్కిళ్లు కనిపించాయి. ముఖం మీద వాలిన ఆ ముంగురులు నన్ను 'ఆమె' ముగ్గులోకి దించేలా చేశాయి. ఒక్కక్షణం నన్ను నేను తమాయించుకుందామనుకున్నాను. కానీ సాధ్యం కాలేదు. ఆమె దగ్గరకు వెళ్లి ఐలవ్యూ చెప్పే పరిస్థితికి లాక్కెళ్లాయి. తీరా పెళ్లయ్యాక దగ్గరకు తీసుకుందామనుకుంటే దూరంగా జరుగుతుండే సరికి అనుమానం వచ్చింది. నా అనుమానం నిజమైంది అని నెత్తీ నోరు మొత్తుకుంటున్నాడు ఇమాం.

ఆమె ఆమె కాదు అతడని.. డబ్బు కోసం ఇలా కూడా చేస్తారా అని వెక్కిళ్లు పెడుతున్నాడు. ఉగాండాకు చెందిన ఇమాం మహ్మద్ ముతుంబా 15 రోజుల క్రితం పెళ్లి చేసుకున్నాడు. బురఖా ధరించిన ఆమెను, ఆమె అందాన్ని చూసి ఫ్లాటైపోయాను.. పెళ్లి చేసుకుని మోసపోయాను అని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు ఇమాం. అచ్చంగా అమ్మాయిలా తయారైన ఆమె వేషధారణను చూసి మహిళా పోలీస్‌లు అవాక్కయ్యారు. ఇమాంను మోసం చేసి పెళ్లి చేసుకున్నందుకు అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

  • tags
Next Story