అయిదు రోజుల పాటు మందు బంద్..

అయిదు రోజుల పాటు మందు బంద్..

wine

అయ్‌బాబోయ్ ఎలా అంటే.. మందు పోయించినోడికే ఓటంటారేమోనని.. అందుకే ముందు జాగ్రత్త చర్యగా ఐదు రోజులు మద్యం దుకాణాలు మూసేస్తున్నారు దేశ రాజధాని ఢిల్లీ నగరంలో. అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలో ఎన్నికల సంఘం ఇటువంటి ఆదేశాలిచ్చింది. ఈ మేరకు ఫిబ్రవరి 6 సాయింత్రం నుంచి ఢిల్లీలో ప్రచారం ముగియనుంది. అందుకే ఫిబ్రవరి 6 నుంచి 8 వరకు మద్యం దుకాణాలు మూసివేస్తారు. ఇక ఫిబ్రవరి 9న గురు రవిదాస్ జయంతి కారణంగా మద్యం షాపులు మూసివేస్తారు. అలాగే ఫిబ్రవరి 10న కూడా కొంత సమయం మాత్రం దుకాణాలు తెరుస్తారు. ఇక 11న ఓట్ల లెక్కింపు జరగనున్న నేపధ్యంలో ఆ రోజు కూడా మద్యం బంద్. సో.. మొత్తంగా అయిదు రోజులు మందు బాబులకు సెలవులు ప్రకటించింది ఎన్నికల సంఘం.

Read MoreRead Less
Next Story