- Home
- /
- ఆంధ్రప్రదేశ్
- /
- ప్రజా బ్యాలెట్‌లో అమరావతికే ప్రజలు...
ప్రజా బ్యాలెట్‌లో అమరావతికే ప్రజలు పట్టం

రాజధాని కోసం అమరావతి రైతులు ఉధ్యమాన్ని మరింత ఉధృతం చేస్తున్నారు. ర్యాలీలు, దీక్షలు, మహా ధర్నాలతో తమ ఆందోళనలను వ్యక్తం చేస్తున్నారు.అమరాతి రైతుల పోరాటానికి ప్రజల నుంచి కూడా మద్దతు పెరుగుతోంది. ఉండవల్లిలో నిర్వహించిన ప్రజా బ్యాలెట్‌లో రైతులతో పాటు..పెద్ద ఎత్తున అమరావతి ప్రజలు పాల్గొన్నారు. అమరావతికి మద్దతుగా ఓటు వేశారు. జేఏసీ నిర్వహించిన ప్రజా బ్యాలెట్‌లో మొత్తం 1635 పాల్గొంటే..అందులో అమరావతికి అనుకూలంగా 1632 ఓట్లు వచ్చాయి. అమరావతికి వ్యతిరేకంగా మూడు ఓట్లు మాత్రమే పోలయ్యాయి.
ఉండవల్లిలో నిర్వహించిన ప్రజా బ్యాలెట్‌లో పాల్గొన్న నారా లోకేష్.. ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్యాకేజీల పేరుతో రాజధాని రైతులను రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తోందని ధ్వజమెత్తారు. ఇన్‌సైడర్ ట్రేడింగ్ అంటూ ఆరోపణలు చేసిన ప్రభుత్వం ఏం నిరూపించిందని ప్రశ్నించారు. అమరావతి ప్రజలకు జరిగిందే రేపు విశాఖ ప్రజలకూ జరుగుతుందని నారా లోకేష్ పేర్కొన్నారు. మరో ఆరు నెలల తర్వాత రాజధానిని పులివెందులలో అన్నా ఆశ్చర్యం లేదని ఎద్దేవాచేశారు. కృష్ణా, గుంటూరు వైసీపీ నేతలు రాజీనామా చేసి సీఎంపై ఒత్తిడి తేవాలన్నారు.
అటు గుంటూరులో నిర్వహించిన ప్రజాబ్యాలెట్‌కు అనూహ్య స్పందన వచ్చింది. మొత్తం 4,211 మంది ఓటింగ్‌లో పాల్గొన్నారు. అమరావతికి అనుకూలగా 4,193 ఓట్లు పోలవ్వగా.. 3రాజధానుల ప్రతిపాదనకు కేవలం 16 ఓట్లు మాత్రమే వచ్చాయి. గుంటూరులో జరిగిన ఓట్ల లెక్కింపు కార్యక్రమంలో మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు పాల్గొన్నారు. ఇప్పటికైనా ప్రజాభిప్రాయాన్ని తెలుసుకుని సీఎం నిర్ణయాలు తీసుకోవాలని ప్రభుత్వానికి పుల్లారావు సూచించారు.
Tags
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com