ఆంధ్రప్రదేశ్

పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రజా చైతన్య యాత్ర

పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రజా చైతన్య యాత్ర
X

అమరావతి పరిరక్షణ కోసం అందరిలో ఉద్యమ స్ఫూర్తిని రగిలించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా చైతన్య యాత్ర చేపట్టారు. పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించారు. అమరావతి కోసం పోరాడుతున్న చంద్రబాబు నారాయణపురం, గణపవరం, ఉండి, భీమవరం, పాలకొల్లు, మాటేరులో పర్యటించారు. నారాయణపురంలో చంద్రబాబు నాయుడు కొంతదూరం పాదయాత్ర చేస్తూ జోలెపట్టి విరాళాలు సేకరించారు.

గణపవరంలో టీడీపీ కార్యకర్తలతో కలిసి బైక్‌ ర్యాలీలో పాల్గొన్నారు చంద్రబాబు. ఒక రాష్ట్రం.. ఒకే రాజధాని ఉండాలని.. దీనిపై ప్రజా చైతన్యం రావాలని పిలుపు ఇచ్చారు. తమ సమస్యల కోసం బయటికి వచ్చే ఉద్యోగులు ఇప్పుడు ఏమయ్యారని ప్రశ్నించారు. NGOలు ఎక్కడున్నారన్నారు. ఆనాడు సమైక్య ఉద్యమం చేసిన ఉద్యోగస్తులు... ఇప్పుడు ఎందుకు బయటకు రావడం లేదని చంద్రబాబు నిలదీశారు. ఉద్యోగులు, విద్యార్థులు, ఎన్జీవోలు అంతా కలిసి ఈ నెల 20 అసెంబ్లీ ముట్టడిలో పాల్గొనాలని.. తాము అసెంబ్లీలో పోరాడితే.. మిగిలిన వారు బయట పోరాడాలని పిలుపు ఇచ్చారు.. ఎంతమందిని పోలీసులు అరెస్టు చేస్తారో చూద్దామంటూ అమరావతిపై సమరశంఖం పూరించారు.

భీమవరంలో పర్యటించిన ఆయన అక్కడ కూడా జోలె పట్టారు. వాస్తవాలు మాట్లాడుతున్నందుకే టీవీ5 పై ప్రభుత్వం కక్ష కట్టిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. MSOలను బెదిరించి ప్రసారాలు రాకుండా ప్రభుత్వం అడ్డుకుంటోందన్నారు. ట్రాయ్ నిబంధనలు కూడా ఉల్లంఘించడంపై చంద్రబాబు మండిపడ్డారు.

మాటేరులో రాత్రి 11గంటల వరకూ చంద్రబాబు కొనసాగింది. విశాఖలో ప్రభుత్వ భూములను దోచుకునేందుకే రాజధాని మార్పును వైసీపీ చేపట్టిందని ఆరోపించారు. ఈరోజు రాజధాని రైతులను మోసం చేసిన సీఎం జగన్ భవిష్యత్‌లో విశాఖ వాసులను మోసం చేయరని నమ్మకం ఏంటని చంద్రబాబు ప్రశ్నించారు.

అమరావతి చైతన్య యాత్రలో.. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే..ప్రజల్లో రాజధాని స్పూర్తిని రగిలిస్తున్నారు చంద్రబాబు. ప్రజావేదిక కూల్చివేతతో మొదలైన జగన్ విధ్వంసం రాజధానిని మార్పు వరకూ వచ్చిందని ఫైర్‌ అయ్యారు.

Next Story

RELATED STORIES