రైతులకు ఇచ్చే కౌలును 10 నుంచి 15 ఏళ్లకు పెంచిన ఏపీ ప్రభుత్వం

రైతులకు ఇచ్చే కౌలును 10 నుంచి 15 ఏళ్లకు పెంచిన ఏపీ ప్రభుత్వం

botsa

అభివృద్ధి పనులన్నీ ఒకే ప్రాంతంలో కేంద్రీకృతం కాకూడదన్న ఉద్దేశంతోనే CRDA బిల్లును రద్దు చేస్తున్నట్లు చెప్పారు మంత్రి బొత్స సత్యనారాయణ. CRDA రద్దు బిల్లును బొత్స అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. 13 జిల్లాలు అభివృద్ధి చెందాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ప్రాంతీయ అసమానతల వల్లే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిందన్నారు. గత ప్రభుత్వం శివరామకృష్ణన్ కమిటీ నివేదికను పట్టించుకోకుండా రాజధానిపై ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని ఆరోపించారు బొత్స.

గత ప్రభుత్వం కంటే రైతులకు మెరుగైన సాయం చేస్తామన్నారు మంత్రి బొత్స. భూములిచ్చిన రైతులకు ఇచ్చే కౌలును 10 నుంచి 15 ఏళ్లకు పెంచారు. కౌలురైతులకు ఇస్తున్న పెన్షన్‌ను 2,500గా నుంచి 5 వేలు చేస్తున్నట్లు చెప్పారు.

Tags

Next Story