బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్న కేంద్రం

బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్న కేంద్రం

nimala

ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెట్టేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా.. బడ్జెట్‌ 2020 ప్రతుల ముద్రణకు ముందు హల్వా వేడుకను నార్త్ బ్లాక్‌లోని ఆర్థికశాఖ ప్రధాన కార్యాలయంలో నిర్వహించారు. అక్కడ తయారు చేసిన హల్వాను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రుచి చూశారు. ఈ కార్యక్రమంలో ఆమెతోపాటు ఆర్థికశాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్‌, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

బడ్జెట్ సమర్పించడానికి పది రోజుల ముందు ప్రతుల ముద్రణ ప్రారంభిస్తారు. ఆర్థిక శాఖ ప్రధాన కార్యాలయం బేస్‌మెంట్‌లో ముద్రణ జరుగుతుంది. దీనిలో పాల్గొనే సిబ్బంది పది రోజులపాటు అక్కడే ఉండిపోతారు. ఈ ముద్రణకు ముందు హల్వా వేడుక నిర్వహిస్తారు.

Tags

Read MoreRead Less
Next Story