షిరిడీ సాయి భక్తులకు శుభవార్త..
షిరిడీ సాయి భక్తులకు శుభవార్త.. బంద్ విరమిస్తున్నట్లు స్థానిక ప్రజలు ప్రకటించారు. ఇవాళ సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో సమావేశం తరువాత తదుపరి కార్యాచరణ ప్రకటించనున్నారు. నిన్న ఒక్క రోజు షిరిడీ గ్రామస్థులు బంద్ చేపట్టారు. బంద్ సమయంలో అలయ పరిసరాల్లోని హోటళ్లు, రెస్టారెంట్లు, ధర్మశాలలు మూశేసారు. అయితే దర్శనాలు, పూజలు యథావిధిగా కొనసాగాయి. బంద్ ప్రభావం ఆలయంపై ఉండబోదని ఆలయ ట్రస్టు ప్రకటించింది.
ఆదివారం బంద్ సందర్భంగా స్వచ్ఛందంగానే దుకా ణాలు, వ్యాపార సముదాయాలు మూతపడ్డాయి. రవాణ వ్యవస్థ కూడా నిలిచిపోయింది. కార్యకలాపాలన్నీ స్తంభించడంతో వీధులు నిర్మానుష్యంగా మారాయి. ఐతే, షిర్డీ ఆలయంలో మాత్రం దర్శనాలు యధావిధిగా కొనసాగాయి. ఆదివారం కావడంతో భక్తులు కూడా పె ద్ద సంఖ్యలో తరలి వచ్చారు. బాబాను దర్శించుకొని ఆశీర్వాదం తీసుకున్నారు.
సాయిబాబా జన్మస్థలమైన పత్రిలో భక్తుల సౌకర్యార్థం భవనాల నిర్మాణానికి 100 కోట్ల రూపాయలు కేటాయిస్తామంటూ సీఎం ప్రకటించడంతో షిర్డీ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పత్రి అభివృద్ధితో షిర్డీ ఆలయ ప్రాశస్త్యం తగ్గిపోతుందేమోనని షిరిడీ, పరిసర గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. పత్రి సాయిబాబా జన్మస్థలమన్న వ్యాఖ్యలను ఉద్ధవ్ ఉపసంహరించుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com