ఐటీఐ అర్హతతో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు..
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్-IOCL దేశవ్యాప్తంగా ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, మెషినిస్ట్ విభాగాల్లో ట్రేడ్ అప్రెంటీస్ పోస్టుల భర్తీ చేయనుంది. ఇందుకు సంబంధించిన 248 ఖాళీలను ప్రకటించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు, పుదుచ్చేరిలో ఈ పోస్టుల్ని భర్తీ చేయనుంది. ఇవి ఒక్క ఏడాదికి సంబంధించిన అప్రెంటీస్ పోస్టులు. ట్రేడ్ అప్రెంటీస్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు 2020 జనవరి 27 చివరి తేదీ.
మొత్తం ఖాళీలు: 248.. తెలంగాణ: 22.. ఆంధ్రప్రదేశ్: 27.. కర్నాటక: 78.. తమిళనాడు, పుదుచ్చేరి: 121.. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 2020 జనవరి 14.. దరఖాస్తుకు చివరి తేదీ: 2020 జనవరి 27.. రాత పరీక్ష: 2020 ఫిబ్రవరి 9.. విద్యార్హత: సంబంధిత విభాగంలో ఐటీఐ.. వయసు: 2019 డిసెంబర్ 31 నాటికి 18 నుంచి 24 ఏళ్లు ఉండాలి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com