వైఫల్యాల నుంచే గుణపాఠాలు నేర్చుకుని విజయం సాధించాలి: పరీక్షా పే చర్చలో మోదీ
By - TV5 Telugu |20 Jan 2020 5:18 PM GMT
వైఫల్యాల నుంచే గుణపాఠాలు నేర్చుకుని విజయం సాధించాలని ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్థులకు పిలుపునిచ్చారు. విద్యార్థులకు ఎగ్జామ్స్ సీజన్ సమీపిస్తుండటంతో.. వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపేందుకు ఢిల్లీలోని టల్కటోరా స్టేడియమ్‌లో పరీక్షా పే చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సుమారు 2 వేల మంది విద్యార్థులు పాల్గొన్నారు. వీరిలో వెయ్యి మందిని ఎస్సే కాంపిటిషన్ ద్వారా సెలెక్ట్ చేశారు. విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. చంద్రయాన్ -2 మిషన్‌లో వైఫల్యాలను అధిగమించి.. ఇస్రో విజయ తీరాలవైపు వెళుతూ కొత్త పరిశోధనలు చేస్తోందని ప్రధాని మోదీ తెలిపారు. విద్యార్థులకు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు మోదీ.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com