ప్రజలకు భయపడే సీఎం జగన్ దొడ్డిదారిన అసెంబ్లీకి వెళ్లారు : నారా లోకేష్
రాష్ట్రంలో చీకటి పాలన నడుస్తోందని మండిపడ్డారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్. జమ్ము కశ్మీర్‌లో పరిస్థితి ఏపీలో నెలకొందని విమర్శించారు. అరెస్ట్‌లతో రాజధాని పోరాటాన్ని ఆపలేరని దుయ్యబట్టారు. ప్రజలకు భయ్యపడే సీఎం జగన్ దొడ్డిదారిన అసెంబ్లీకి వెళ్లారని అన్నారు లోకేష్.
ఇక రాజధానిగా అమవరాతిని కొనసాగించాలంటూ కృష్ణా జిల్లాలో నిరసనలు కొనసాగుతున్నాయి. నందిగామలో ఆందోళనకు దిగిన టీడీపీ , TNSF నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు . అటు కంచికచర్ల మండలం పరిటాలలో మాజీ జడ్పీటీసీ సభ్యులు కోగంటి బాబును అరెస్ట్ చేశారు . దొనబండ వద్ద మాజీ జడ్పీటీసీ సభ్యులు వాసిరెడ్డి ప్రసాద్‌ను అదుపులోకి తీసుకుని కంచికచర్ల పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే అరెస్ట్ చేయడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ నేతలు..
మూడు రాజధానులు వద్దు అమరావతి రాజధాని కావాలంటూ హోంమంత్రి సుచరిత ఇంటిని ముట్టడికి జేఏసీ నేతలు యత్నించారు. తన అనుచరులలతో సుచరిత ఇంటికి బయలు దేరిన మాజీ మంత్రి ఆలపాటి రాజాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఒక్కసారిగా అక్కడ టెన్షన్ వాతావరణ నెలకొంది. ఆందోళన కారులను పోలీసులు అరెస్ట్ చేసి నల్లపాడు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అటు మందడంలో పోలీస్ యాక్షన్‌పై వ్యతిరేకిస్తూ గ్రామస్తులు ఆందోళకు దిగారు.
ఏపీ అసెంబ్లీ ముట్టడికి అమరావతి జేఏసీ, అకిలపక్షం నేతలు పిలుపునిచ్చిన నేపథ్యంలో బెజవాడలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అసెంబ్లీకి వెళ్లే మార్గం ప్రకాశం బ్యారేజ్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ప్రతి వాహనాన్ని తనిఖీలు చేస్తున్నారు.
తూర్పుగోదావరి జిల్లా పత్తిపాడు నుంచి అసెంబ్లీ ముట్టడికి బయల్దేరిన టీడీపీ ఇన్‌ఛార్జ్ వరుపుల రాజాను హౌజ్ అరెస్ట్ చేశారు.. దాదాపు 100 కార్లతో తరలివెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. టీడీపీ శ్రేణులు భారీగా తరలివచ్చారు.. దీంతో రాజా ఇంటిని చుట్టుముట్టారు పోలీసులు. ఎవరిని బయటకు రానివ్వకుండా అడ్డుకుంటున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com